![]() |
![]() |
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్‌కు సోమవారం రాత్రి నటుడు మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11.15 గంటల సమయంలో వచ్చి ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. తాను తన సిబ్బందితో కనుమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బసచేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, తాము మంచు మనోజ్‌తో ఉన్నామని చెప్పగా పోలీసులు స్టేషన్‌కి పిలిచారన్నారు. తాను స్టేషన్‌కి వచ్చేసరికి ఎస్.ఐ. లేరని విమర్శించారు. ఎక్కడికెళ్లినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ అక్కడే బైఠాయించారు. అనంతరం సీఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్‌లో మాట్లాడారు. తాను ఎంబీయూ విద్యార్థుల కోసం పోరాడుతుంటే ఇలా ఇబ్బందులు పెట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ వివాదంలో మోహన్‌బాబు చేసిన ఫిర్యాదు ఆధారంగానే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
![]() |
![]() |