![]() |
![]() |
.webp)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar)కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.ఆ ఇద్దరి కాంబోలో వచ్చిన 'రంగస్థలం' సంచలన విజయాన్నిఅందుకోవడమే కాకుండా,ఎన్నో రికార్డులని కూడా నెలకొల్పింది.చరణ్ ప్రస్తుతం చేస్తున్న RC16 తర్వాత సుకుమార్ తోనే తన నెక్స్ట్ మూవీ చెయ్యబోతున్నాడు.దీంతో R C 17 పై మెగాఅభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంది.ఈ క్రమంలోనే మూవీకి సంబంధించిన ఒక తాజా న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
చరణ్,సుక్కు ల మూవీ పక్కా యాక్షన్ ప్యాకెడ్ జోనర్ లో తెరకెక్కబోతుందని,పైగా చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడనే టాక్ సినీ సర్కిల్స్ లో వినపడుతుంది.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మేకర్స్ అధికారంగా చెప్తే తప్ప తెలియదు.మూవీలో మరెన్నో సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి.చరణ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు నాయక్,గేమ్ చేంజర్,మగధీర లో డ్యూయల్ రోల్ లో కనిపించాడు.సుకుమార్ మాత్రం ఇంతవరకు డ్యూయల్ రోల్ క్యారక్టర్ ని డైరెక్ట్ చెయ్యలేదు.ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి మూవీకి సంబంధించిన సబ్జెట్ పై అందరిలో క్యూరియాసిటీ కూడా నెలకొని ఉంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనుండగా,'రంగస్థలం' నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)నే ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.రీసెంట్ గా పుష్ప 2(Pushpa 2)తో సుకుమార్, మైత్రి మేకర్స్ పాన్ ఇండియా లెవల్లో హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.
ఇక చరణ్,బుచ్చిబాబు ల ఆర్ సి 16 కి కూడా మైత్రి మేకర్స్ నే నిర్మాణ బాధ్యతలని నిర్వహిస్తుంది.స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చరణ్ క్రికెటర్ గా కనిపించబోతున్నాడనే టాక్ అయితే సినీసర్కిల్స్ లో వినిపిస్తుంది.మూవీ అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా,చరణ్ సరసన దేవర ఫేమ్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది.ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రావాలనే పట్టుదలతో చిత్ర యూనిట్ ఉంది.ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
![]() |
![]() |