![]() |
![]() |

ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)హీరోయిన్ రష్మిక(Rashmika mandanna)కి ఇటీవల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. నెక్స్ట్ ఇయర్ ప్రారంభంలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టుగా సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. రీసెంట్ గా విజయ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విజయ్ తన స్నేహితులతో కలిసి ఆదివారం సాయంత్రం ఏపి లోని 'పుట్టపర్తి సత్యసాయి'(Puttaparthi Sathya sai)సమాధిని దర్శించుకున్నాడు. అనంతరం కారులో హైదరాబాద్ బయలు దేరారు.ఈ క్రమంలోనే విజయ్ ప్రయాణిస్తున్న కారుని బొలోరో వాహనం ఢీకొట్టింది.
దీంతో విజయ్ ప్రయాణిస్తున్న కారు బాగానే డామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. అనంతరం విజయ్ తన ఫ్రెండ్ కి చెందిన మరో కారులో హైదరాబాద్ బయలు దేరి వెళ్లారు.ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు అవ్వలేదు. యాక్సిడెంట్ విషయాన్ని విజయ్ కారు డ్రైవర్ పోలీసులుకి ఫిర్యాదు చెయ్యడంతో, విషయం బయటకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక యాక్సిడెంట్ విషయంపై విజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తాను క్షేమంగానే ఇంటికి చేరుకున్నానని, కాస్త తలనొప్పిగా మాత్రమే ఉందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎక్స్ లో పోస్ట్ చేసాడు.
రష్మిక తో ఎంగేజ్ మెంట్ అయిన రెండు రోజులకే విజయ్ కారు ప్రమాదానికి గురైందనే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. కెరీర్ పరంగా చూసుకుంటే విజయ్ ప్లాప్ ల పరంపర కొనసాగుతూనే ఉంది.జులై లో ఎన్నో అంచనాలతో వచ్చిన 'కింగ్ డమ్' తో మరో పరాజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం రవికృష్ణ కోలా(Ravi Krishna Kola)దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే మూవీ, టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్(Rahul sankrityan)దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే చిత్రాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలపై విజయ్ తో పాటు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
![]() |
![]() |