![]() |
![]() |

సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth)ఆగస్టులో 'కూలీ'(Coolie)తో వచ్చి తన కెరీర్ లో మరోసారి బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కతున్న పార్ట్ 2 లో చేస్తున్నాడు. జైలర్ సూపర్ హిట్ అందుకోవడంతో పార్ట్ 2 పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
రజనీకాంత్ చాలా కాలం నుంచి హిమాలయాలకి(Himalayas)వెళ్లి వస్తుంటాడనే విషయం తెలిసిందే. ఈ కోవలోనే రీసెంట్ గా హిమాలయ పర్యటనకి బయలుదేరి వెళ్ళాడు. పర్యటనలో భాగంగా హిమాలయాల్లోని బద్రీనాధ్(Badrinath)లో కొలువై ఉన్న బద్రినాధుడి ఆలయాన్ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. రజనీకాంత్ రాక సందర్భంగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. అదే విధంగా ఒక మాములు సాధారణ వ్యక్తిలా రజనీ కాంత్ రోడ్ పక్కనే భోజనం చేస్తున్నస్టిల్స్ కూడా వైరల్ గా నిలిచాయి. ఇప్పుడు వీటిని చూసిన అభిమానులు, నెటిజన్స్ రజనీకాంత్ సింప్లిసిటీ ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

![]() |
![]() |