![]() |
![]() |

టాలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. విజయ్ తన స్నేహితులతో కలిసి ఆదివారం నాడు పుట్టపర్తి వెళ్లి.. సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. అనంతరం పుట్టపర్తి నుండి హైదరాబాద్ కి తిరిగి వస్తుండగా.. ఉండవల్లి సమీపంలో విజయ్ కారుని బొలెరో వాహనం ఢీ కొట్టింది. దీంతో విజయ్ కార్ డ్యామేజ్ అయింది. అయితే, విజయ్ సహా కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మరో వెహికల్ లో విజయ్ వాళ్ళు హైదరాబాద్ బయల్దేరారు. (Vijay Deverakonda)
కాగా, తాజాగా రష్మిక మందన్నతో విజయ్ ఎంగేజ్ మెంట్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది 'కింగ్ డమ్'తో నిరాశపరిచిన విజయ్ చేతిలో.. పలు సినిమాలు ఉన్నాయి. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. అలాగే రవికిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్దన్' ఫిల్మ్ చేస్తున్నాడు.
![]() |
![]() |