![]() |
![]() |

'సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam)తో 'విక్టరీ వెంకటేష్(Venkatesh)తన మార్క్ మాయాజాలాన్ని మరోసారి ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏకంగా 256 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టి, వెంకటేష్ కి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో తెలియచేసింది. దీంతో ఇదే రికార్డులని కొనసాగించాలని తన అప్ కమింగ్ సినిమాల లిస్ట్ ని రెడీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ 'త్రివిక్రమ్'(Trivikram)దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. వెంకటేష్ కెరీర్ లో మరుపురాని చిత్రాలుగా ఉన్న 'నువ్వు నాకు నచ్చావు, 'మల్లేశ్వరి', త్రివిక్రమ్ రచనా సారథ్యంలోనే తెరకెక్కాయి. ఆ రెండు చిత్రాల్లోని చాలా సీన్స్, డైలాగుల్ని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఇప్పటికి గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అలాంటిది ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోనే వెంకటేష్ వస్తుండటంతో, వెంకటేష్ మరో హిట్ ని అందుకున్నట్లే అనే మాటలు వినపడుతున్నాయి.
వెంకటేష్ ఈ చిత్రం తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ 'వివి వినాయక్'(VV Vinayak)తో చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ కథా చర్చల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 'లక్ష్మి'(Lakshmi)ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా ,వెంకటేష్ ఇమేజ్ ని రెట్టింపు చేసింది. మాస్, క్లాస్, ఫ్యామిలీ కి సంబందించిన అన్ని అంశాలు చాలా చక్కగా కుదిరాయి. దీంతో ఆ ఇద్దరి కాంబోలో తెరకెక్కబోయే మూవీ ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉంది.
ఇక వినాయక్ నుంచి సినిమా వచ్చి ఏడు సంవత్సరాలు అవుతుంది. 2023 లో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఛత్రపతి రీమేక్ ని హిందీలో చేసాడు. తెలుగు ప్రేక్షకుల ముందుకు, మంచి సినిమాతోతో వచ్చి తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వెంకటేష్ తో మూవీకి రెడీ అవుతున్నాడు. దీంతో మూవీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతుందో అర్ధమవుతుంది. 'లక్ష్మి'ని నిర్మించిన హిట్ చిత్రాల నిర్మాత 'నల్లమలపు బుజ్జి' నే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన రానుంది. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అప్ కమింగ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana shankara Vara prasad garu)లో కూడా వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

![]() |
![]() |