![]() |
![]() |

మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం మొదలైనట్లే కనిపిస్తోంది. ఉదయం రామ్‌చరణ్ తనకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ప్రకటించి, తనతో రెండు రోజులుగా సన్నిహితంగా మెలగినవాళ్లను టెస్ట్ చేయించుకొమ్మని కోరాడు. ఆ క్రమంలో లేటెస్ట్‌గా తనకు కరోనా వైరస్ సోకినట్లు తేలిందని వరుణ్ తేజ్ ప్రకటించాడు. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన నోట్‌లో "ఈ రోజు ఉదయం స్వల్ప లక్షణాలతో ఉన్న నేను టెస్ట్ చేయించుకోగా, కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలో కోలుకొని వస్తాను. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు" అంటూ వెల్లడించాడు.

ఇటీవల డిసెంబర్ 25న మెగా ఫ్యామిలీలోని యంగ్‌స్టర్స్ అందరూ కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఆ వేడుకల్లో చరణ్-ఉపాసన దంపతులతో పాటు పాటు అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతులు, అల్లు బాబీ దంపతులు, శిరీష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక-చైతన్య దంపతులు, సుస్మిత దంపతులు, శ్రీజ దంపతులు.. ఇలా ఆ ఫ్యామిలీకి చెందిన పలువురు కలిసి పాల్గొన్నారు. ఇప్పుడు చరణ్, వరుణ్ కొవిడ్-19గా నిర్ధారణ కావడంతో, ఆ వేడుకల్లో పాల్గొన్న మిగతావారి పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది.
.jpg)
![]() |
![]() |