![]() |
![]() |

'భరత్ అనే నేను' హీరోయిన్ కియారా అద్వానీకి ఎలాంటి వ్యక్తి కావాలి? హాలీవుడ్ తార జెన్నిఫర్ లారెన్స్‌కు ఉన్నటువంటి తెలివితేటలు, హృతిక్ రోషన్ లాంటి రూపం, అక్షయ్ కుమార్ లాంటి క్రమశిక్షణ, దృఢత్వం ఉండాలంట. అంతేనా.. ఈ లిస్ట్‌లో మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. "అతనికి అంబానీలకు ఉన్నంత డబ్బు, ఫరాన్ అఖ్తర్, ఆయుష్మాన్ ఖురానాలకు ఉన్నటువంటి టాలెంట్ కూడా ఉండాలి" అని చెబుతోంది కియారా. ఆమె కోరికలు మామూలుగా లేవు కదా!
ఈ విషయం ఎప్పుడు, ఎక్కడ చెప్పిందని అడుగుతారా? నేహా ధూపియా చాట్ షోలో ఈ విషయాలు వెల్లడించింది కియారా. బాలీవుడ్‌లోని ఫిట్టెస్ట్ యాక్ట్రెసెస్‌లలో ఒకమ్మాయిగా పేరుపొందిన ఆమె రోజువారీ డైట్‌లో బెండకాయ, గుమ్మడికాయ, సాల్మన్ చేప ఉండాల్సిందే. "సాల్మన్ ఫిష్‌తో పాటు ఎవరైనా బెండకాయలు తింటారని అనుకోను.. ఆఖరికి మా అమ్మ కూడా దీన్ని విచిత్రంగా చూస్తుంటుంది. ఇది నేను కనిపెట్టిన టేస్ట్, నాకు నచ్చింది" అని ఆమె తెలిపింది.
![]() |
![]() |