![]() |
![]() |

తమిళంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'తుగ్లక్ దర్బార్'. ఢిల్లీ ప్రసాద్ దీనదయాళన్ దర్శకుడు. ఇందులో అదితీరావ్ హైదరీ కథానాయిక. మార్చిలో లాక్ డౌన్ విధించడానికి ముందు హీరో హీరోయిన్ల మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఏమైందో ఏమో... ఇప్పుడు కథానాయికను మార్చారు.
అదితి రావు హైదరిని సినిమా నుంచి తీసేసి ఆమె స్థానంలో రాశీ ఖన్నా తీసుకున్నారు. మూడు రోజులుగా విజయ్ సేతుపతితో రాశీ ఖన్నా చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలిసింది. గతంలో అదితీ మీద తీసిన సన్నివేశాలను మళ్లీ తెరకెక్కిస్తున్నారట. అదితీని ఎందుకు తప్పించారు అనే ఈ విషయంలో పూర్తి స్పష్టత లేనప్పటికీ... ఆమెతో చిత్ర బృందానికి ఏవో సమస్యలు ఉన్నాయట. ఈ చిత్రంలో మంజిమా మోహన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.
![]() |
![]() |