![]() |
![]() |

మరికొన్నిగంటల్లో రజనీకాంత్(Rajinikanth)నాగార్జున(Nagarajuna),అమీర్ ఖాన్(Amir Khan),ఉపేంద్ర(Upendra),లోకేష్ కనగరాజ్(lOkesh Kanagaraj)ల 'కూలీ'(Coolie)మూవీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. దీంతో కూలీ మూవీ రిజల్ట్ పై అభిమానులతో పాటుప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అయితే అన్ని చోట్ల రికార్డు బుకింగ్స్ ని సొంతం చేసుకుంది.
రీసెంట్ గా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin)ఎక్స్(X)వేదిపైగా 'కూలీ మూవీ ముందుగా చూసే అవకాశం లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ లో ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేశాను.విడుదలైన ప్రతి చోట కూలీ ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు అని ట్వీట్ చేసాడు.
ఉదయనిధి స్టాలిన్ సినీ రంగంలో తన సత్తా చాటిన విషయం తెలిసిందే. 2012 లో 'ఒరు కల్ ఒరు కన్నడి' అనే చిత్రంతో హీరోగా పరిచయమైన స్టాలిన్ మొదటి సినిమాతోనే బెస్ట్ మేల్ డెబ్యూ గా ఫిలింఫేర్ ని అందుకున్నాడు. ఆ తర్వాత సుమారు పద్నాలుగు చిత్రాల వరకు చేసి ఎంతో మంది అభిమానులని సంపాదించాడు. చివరగా 2023 లో మామన్నన్ లో కనిపించగా, కొన్ని చిత్రాలు తెలుగులో కూడా రిలీజయ్యాయి.

![]() |
![]() |