![]() |
![]() |
.webp)
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)రేపు హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి 'వార్ 2'(War 2)తో థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. పైగా ఈ చిత్రం ఎన్టీఆర్ కి బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడంతో ,బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే హృతిక్ రోషన్ పలు రకాల ఇంటర్వ్యూలతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం మాట్లాడుతు 'ఎన్టీఆర్ యాక్టింగ్ నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పడంతో వార్ 2 లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
వార్ 2 కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్స్ తో పాటు అదనపు షో లకి అనుమతి ఇస్తు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తు వార్ 2 కి సంబంధించిన షోస్, ధరల విషయంలో ప్రత్యేక జీవో జారీ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)గారు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh)గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో 'వార్ 2 కి రిలీజ్ రోజు ఉదయం 5 గంటల షోకి పర్మిషన్, టికెట్ ధర 500 కి మించి ఉండకూడదు. రిలీజ్ రోజు నుండి పది రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో జిఎస్ టి తో కలుపుకొని ప్రస్తుతం ఉన్న ధరలకి 100 రూపాయిలు, సింగిల్ స్క్రీన్స్‌లో 75 రూపాయలు అదనంగా పెంచుకోవచ్చు. డైలీ ఐదు షో లకి మించి ప్రదర్శించకూడదని పేర్కొంది.
.webp)
![]() |
![]() |