![]() |
![]() |

హీరోగా సుదీర్ఘ కాలంపాటు రాణించి, సినీ రంగంలో తనకంటు ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నాడు జగపతిబాబు(Jagapathi Babu). ఫ్యామిలీ, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్, ఇలా అన్ని జోనర్స్ కి సంబంధించిన చిత్రాల్లో, ఎటువంటి క్యారక్టర్ ని అయినా అవలీలగా పోషించి,ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించగల సత్తా ఆయన సొంతం. ప్రస్తుతం ప్రతి నాయకుడుగా తన సత్తా చాటుతు బిజీగా ఉన్నాడు.
ఇప్పుడు జగపతిబాబు ఫస్ట్ టైం ప్రముఖ ఛానల్ 'జీ'(Zee Tv)వేదికగా ప్రసారం కాబోయే 'జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి'(Jayammu Nischayammu raa with Jagapathi Babu)అనే టాక్ షో తో 'స్మాల్ స్క్రీన్'పై హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ షో కి 'కింగ్ నాగార్జున'(Nagarjuna)ఫస్ట్ గెస్టుగా రాబోతున్నాడు. రీసెంట్ గా 'షో' కి సంబంధించిన ప్రోమో రిలీజై అభిమానులతో పాటు బుల్లి తెర ప్రేక్షకులని విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రోమోలో 'నాగార్జున సినీ కెరీర్ తో పాటు, తండ్రి లెజెండ్రీ యాక్టర్ నాగేశ్వరరావుగారితో ఉన్న అనుబందం, భావోద్వేగాలు, వ్యక్తిగత జీవితం, నాగార్జున గురించి సోదరుడు వెంకట్, సోదరి నాగసుశీల చెప్పిన విషయాలు, నాగార్జున, జగపతి బాబు మధ్య ఉన్న స్నేహబంధం, ఇద్దరి మధ్య జరిగిన కొన్ని ఫన్నీ సంగతులు 'షో'లో ఉండబోతున్నాయని అర్ధమవుతుంది.
దీంతో అక్కినేని అభిమానులు, జగపతి బాబు అభిమానులు ఎప్పుడెప్పుడు 'జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి' టాక్ షో చూస్తామా అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఆగస్టు 15 న ఓటిటి వేదికగా జీ5(Zee 5)లో, ఆగస్టు 17 న ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

![]() |
![]() |