![]() |
![]() |

తొలి చిత్రం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో మంచి విజయాన్ని అందుకొని నటుడుగా కూడా తానేంటో ప్రూవ్ చేసుకున్న హీరో సందీప్ కిషన్. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా సందీప్ కిషన్ కి అంతగా గుర్తింపుని తీసుకురాలేదు.పైగా సందీప్ కిషన్ అనే నటుడు ఇంకా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడనే విషయాన్ని కూడా చాలా మంది మరిచిపోయారు. ఇలాంటి టైం లో నేనున్నాను అంటు సందీప్ కిషన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎన్నో విభిన్నమైన చిత్రాలకి దర్శకత్వం వహించిన వి.ఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 9 న థియేటర్స్ లోకి అడుగు పెట్టబోతోంది. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా తెలుపుతు అందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఒక డిఫరెంట్ లుక్ తో ఉన్న ఆ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. పైగా చాలా రోజుల తర్వాత ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ రావడం ఒక విశేషమే అని చెప్పుకోవాలి.

వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ లు హీరోయిన్లుగా చేస్తున్న ఈ చిత్రంలో హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నాడు.
![]() |
![]() |