![]() |
![]() |

తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు కాశీనాథుని విశ్వనాథ్‌కు, మెగాస్టార్ చిరంజీవికి మధ్య గురుశిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి వంటి సినిమాలు మెగాస్టార్ కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. మాస్ హీరోగా మాత్రమే కాక, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం ఉన్నత స్థాయిలో నటించగలనని ఆ సినిమాలతో చిరు నిరూపించారు.
.jpg)
.jpg)
తనని క్లాస్ అండ్ క్లాసికల్ హీరోగా నిలబెట్టిన కళాతపస్వి కె. విశ్వనాథ్‌ను దీపావళి సందర్భంగా సతీమణి సురేఖతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి కలుసుకున్నారు. ఇండస్ట్రీ పెద్దగా ఉన్న తన శిష్యుడు తన ఇంటికి రావడం పట్ల విశ్వనాథ్ సంబరపడ్డారు. కాసేపు ఇద్దరు తమ మధుర క్షణాలను, అప్పటి సినిమా విశేషాలను గుర్తుచేసుకున్నారు. గురువు యోగ క్షేమాలను చిరు అడిగి తెలుసుకున్నారు. గురువును చిరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
.jpg)
.jpg)
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. "విశ్వనాథ్ గారిని కలవాలనిపించి ఈరోజు ఆయన ఇంటికి రావడం జరిగింది. ఆయన నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారు. ఈ దీపావళి సందర్భంగా ఆయన్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు" అన్నారు.
.jpg)
.jpg)
![]() |
![]() |