![]() |
![]() |

బుట్టబొమ్మ పూజా హెగ్డే పుట్టినరోజు ఈ రోజు (అక్టోబర్ 13). ఇటలీలో సెలబ్రేట్ చేసుకుంటోంది. ప్రభాస్‌తో కలిసి తొలిసారి నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రీకరణ కోసం పూజా హెగ్డే ఇటలీ వెళ్లింది. సో... పుట్టినరోజును అక్కడే జరుపుకుంటోంది. సోమవారం షూటింగ్ చేసి, హోటల్ కి వచ్చిన పూజా హెగ్డేకి ఆమె టీమ్ సర్‌ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారు. 'happy birthday' లెటర్స్ ఆకారంలో ఉన్న బెలూన్స్ కొన్నారు. అయితే, అందులో 'h - హెచ్' మిస్ అయింది. అది గమనించిన పూజా హెగ్డే నవ్వు ఆపుకుంటూ అసలు విషయాన్ని వీడియో తీసి ఇన్‌స్టా స్టోరీలలో పోస్ట్ చేశారు.

'హెచ్' ఏమైంది? అని పూజా హెగ్డే అడగ్గా... "హెచ్ అంటే హ్యాపీనెస్. అది నీకు ఇచ్చేశాం" అని పూజా హెగ్డే తల్లి చెప్పారు. కుమార్తెతో పాటు ఆమె కూడా ఇటలీకి వెళ్లారు. ఈ రోజు 'రాధే శ్యామ్' యూనిట్ సభ్యుల మధ్య పూజా హెగ్డే పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోనున్నారు.

![]() |
![]() |