![]() |
![]() |

స్టార్ హీరో సూర్య(Suriya)ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj)దర్శకత్వంలో తెరకెక్కుతున్న'రెట్రో'(Retro)తో పాటు, ఆర్ జె బాలాజీ(Rj Balaji) దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా ముందుగా'రెట్రో'ప్రేక్షకుల ముందుకు రానుంది.వీటితో పాటు వెట్రిమారన్(Vetrimaaran),తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి(Venki Atluri)దర్శకత్వంలో సినిమాలకి కూడా సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
వెంకీ అట్లూరి మూవీని అగ్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.ఇందులో ఇద్దరు హీరోయిన్లకి ఛాన్స్ ఉందని,ఒక హీరోయిన్ గా 'భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse)ని ఫైనల్ చేశారనే వార్తలు వచ్చాయి.మరో హీరోయిన్ గా'కయదు లోహర్'(Kayadu Lohar)ని ఎంపిక చేశారనే ప్రచారం వినిపించింది.కయదు లోహర్ ఇటీవల ప్రదీప్ రంగనాధన్ తో కలిసి 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లో నటించి యూత్ మన్ననలు పొందింది.కాని ఇప్పుడు కయదు ప్లేస్ లో 'సంయుక్త మీనన్'(samyuktha Menon)పేరుని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది.
సంయుక్త మీనన్ ఇప్పటికే సితార బ్యానర్ లో భీమ్లానాయక్,సార్ వంటి చిత్రాల్లో నటించింది.ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా కెరీర్ పరంగా కూడా సంయుక్త కి ఎంతగానో ఉపయోగపడ్డాయి.మరి సూర్య మూవీలో సంయుక్త నటించడం ఖాయమైతే సితార సంస్థలో హ్యాట్రిక్ ఫిలిం అవుతుంది.ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
![]() |
![]() |