![]() |
![]() |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ప్రస్తుతం బుచ్చిబాబు సానా(Buchibabu Sana)దర్శకత్వంలో'పెద్ది'(Peddi)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ నిన్న ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చెయ్యగా అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇప్పుడు ఈ మూవీ గ్లింప్స్ రిలీజైన 24 గంటల్లోనే 36 .05 మిలియన్ల వ్యూస్ ని సాధించి సరికొత్త రికార్డుని నెలకొల్పింది.దీంతో ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ జాబితాలో ఉన్న దేవర 26 .17 మిలియన్లు, పుష్ప 2 20 .45 మిలియన్ల వ్యూస్ రికార్డుని 'పెద్ది' దాటేసాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.పెద్ది గ్లింప్స్ కి వస్తున్న రెస్పాన్స్ కి తనతో పాటు చిత్ర బృందం మొత్తం ఎంతో ఆనందపడుతుందని చరణ్ తెలిపాడు.
చరణ్ సరసన జాన్వీ కపూర్ జత కడుతున్న 'పెద్ది'లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(SivarajKUmar)తో పాటు జగపతిబాబు,దివ్యేంద్రు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్(Ar rehman)మ్యూజిక్ అని అందిస్తుండగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుంది.2026 మార్చి 27 చరణ్ బర్త్ డే కానుకగా పెద్ది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
.webp)
![]() |
![]() |