![]() |
![]() |

బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్(Salman khan)ఈద్ కానుకగా మార్చి 30 న 'సికందర్'(Sikandar)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని చవి చూసి సల్మాన్ అభిమానులని ఎంతగానో నిరాశపరిచింది.దీంతో సల్మాన్ తన తదుపరి చిత్రాన్ని ఎలాంటి కథాంశంతో తెరకెక్కిస్తాడనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఉంది.
ఈ క్రమంలో తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'భజరంగీబాయ్ జాన్'(Bajrangi Bhaijaan)కి సీక్వెల్ తెరకెక్కించే యోచనలో సల్మాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఈ వార్తలకి బలం చేకూర్చేలా మొదటి పార్ట్ కి కథని అందచేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తో సల్మాన్ చర్చలు జరుపుతున్నాడు.ఫస్ట్ పార్ట్ దర్శకుడు కబీర్ ఖాన్ నే సీక్వెల్ కి దర్సకత్వం వహిస్తున్నాడని,ఆల్రెడీ మూవీ కి సంబంధించిన పనుల్లో ఉన్నాడని కూడా తెలుస్తుంది.సీక్వెల్ పై త్వరలోనే ప్రకటన కూడా రానుందని బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
'భజరంగీ బాయ్ జాన్' 2015లో ప్రేక్షకుల ముందుకు రాగా పాకిస్థాన్ కి చెందిన షాహిదా అనే ఆరేళ్ళ పాప తప్పిపోయి ఇండియాకి వస్తుంది. ఆ పాపని అక్కున చేర్చుకొని తన కన్నవాళ్ళ దగ్గరకి పంపించే భజరంగీ క్యారక్టర్ లో సల్మాన్ ప్రదర్శించిన నటన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.కరీనా కపూర్,నవాజుద్దిన్ సిద్ధికి,హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించారు.సల్మాన్,రాక్ లైన్ వెంకటేష్ 75 కోట్లతో నిర్మించగా 918 కోట్లపైనే వసూలు చేసింది.దీన్ని బట్టి చిత్ర విజయాన్ని అర్ధం చేసుకోవచ్చు.

![]() |
![]() |