Home  »  News  »  UStaad Bhagat singh: గెలిచిన ఉస్తాద్ భగత్ సింగ్.. సాక్ష్యంగా నిలిచిన సుప్రీంకోర్టు

Updated : Mar 13, 2026

 

 

-సుప్రీం తీర్పుతో సినిమా వాళ్ళల్లో సంబరాలు 
-తెలంగాణ హైకోర్టుకి షాక్ 
-తీర్పులో ఏమని చెప్పింది  


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat singh)ఉగాది కానుకగా ఈ నెల 18 న బెనిఫిట్ షోస్ నుంచే సందడి చేయనున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులతో పాటు సినీ సర్కిల్స్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది. పైగా వరుస ప్రమోషన్స్ తో మూవీపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. నిన్న రిలీజైన మూడో సాంగ్ నే అందుకు ఉదాహరణ. కానీ వాళ్లందరిలో మాత్రం ఒక దిగులు ఆవహించి ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఏరియా అభిమానుల్లో. ఇప్పుడు ఆ దిగులు సుప్రీం కోర్టు తీర్పుతో ఎటు వెళ్లిందో కూడా తెలియని పరిస్థితి. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.

కొత్త సినిమాలకి టికెట్ రేట్స్ పెంచుకునే వీలు కలిపిస్తూ తెలంగాణ(Telangana)ప్రభుత్వం రెండు రోజుల ముందు జీవో జారీ చెయ్యడం, లేదా చివరి నిమిషంలోనో జారీ చేయడమో జరుగుతుంది. ఆ వెంటనే ఎవరో ఒకరు కోర్టులో టికెట్ పెంపుపై కేసు వేస్తున్నారు. దీంతో  అభిమానుల్లో, మూవీ లవర్స్ లో టెన్షన్ స్టార్ట్. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు స్పందిస్తు    టికెట్ ధరలని పెంచుతు నిర్ణయం తీసుకుంటే ఆ వివరాలని రిలీజ్ కి  90 రోజుల ముందే బహిర్గతం చేయాలని తెలంగాణ హైకోర్టు తీర్పుని ప్రకటించింది. దీంతో అభిమానుల్లో,సినీ మేకర్స్ లో కొత్త టెన్షన్ మొదలయ్యింది.     

 హైకోర్టు ఇచ్చిన తీరుపై అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)సుప్రీం కోర్టు(Supreme Court)ని ఆశ్రయించింది. ఈ నిబంధన వల్ల సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడుతుంది. రిలీజ్ డేట్స్  చివరి నిమిషంలో మారుతుంటాయి. అలాంటప్పుడు  3 నెలల ముందే ధరల వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని మైత్రి తరుపు లాయర్ వాదించాడు. సదరు వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన '90 రోజుల గడువు' ఉత్తర్వులపై స్టే విధించింది.ఈ నిబంధన వల్ల చిత్ర పరిశ్రమ స్తంభించిపోయే ప్రమాదం ఉందనే వ్యాఖ్య కూడా సుప్రీంకోర్టు చేసింది.

also read: Priyanka mohan: ఓజి ప్రియాంక మోహన్ ఆవేదన.. డబ్బులు ఇచ్చి ఎందుకు చేయించారు


దీంతో గతంలో లాగే రిలీజ్ కి  కొద్ది రోజుల ముందు టికెట్ రేట్స్ పెంపు కోసం ప్రభుత్వ  అనుమతులు పొందే అవకాశం నిర్మాతలకి  కలిగింది. ఉస్తాద్ భగత్ సింగ్ ని మైత్రి మూవీ మేకర్స్ పవన్ కెరీర్ లోనే భారీ వ్యయంతో నిర్మించిన విషయం తెలిసిందే.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.