![]() |
![]() |
సూపర్‌స్టార్ రజినీకాంత్, టి.జె.జ్ఞానవేల్ కాంబినేషన్‌లో తలైవా 170గా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వేట్టయాన్’. ఈ చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేశారు రజినీ. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రజినీకి గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది. రూ.160 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. రెగ్యులర్‌గా ఉండే రజినీ స్టైల్‌కి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని, అలాంటి ఓ వైవిధ్యమైన కథతో సినిమా చేసేందుకు ఒప్పుకున్న రజినీకి థాంక్స్ అంటూ రానా చెప్పిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో అన్ని భాషలకు చెందిన నటీనటులు ఉన్నారు. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, దుసరా విజయ్.. అన్ని ఇండస్ట్రీలకు చెందిన టాప్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఓ మంచి సినిమాలో తాను కూడా భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని రానా అంటున్నాడు. ‘జైలర్’ చిత్రంతో సంచలనం సృష్టించిన రజినీకాంత్ ‘వేట్టయాన్’ చిత్రంతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వేచి చూడాల్సిందే.
![]() |
![]() |