![]() |
![]() |

కొంతకాలంగా సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న వార్తలు ఎక్కువగా వింటున్నాం. ఇప్పుడు ఆ లిస్టులో ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జి.వి. ప్రకాష్ కుమార్ - సైంధవి జంట కూడా చేరిపోయింది.
జి.వి. ప్రకాష్.. తన బాల్య స్నేహితురాలు, సింగర్ సైంధవిని 2013 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020 లో ఈ జంటకి కూతురు పుట్టింది. అయితే పెళ్లయిన 11 ఏళ్ళ తర్వాత విడిపోతున్నట్లు తాజాగా ప్రకటించి షాకిచ్చారు జి.వి. ప్రకాష్, సైంధవి దంపతులు.
ఎంతో ఆలోచించిన తర్వాత, తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు జి.వి. ప్రకాష్, సైంధవి ప్రకటించారు. మానసిక ప్రశాంతత మరియు తమ జీవితాలు మెరుగ్గా ఉండటం కోసం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "మేము విడిపోవాలని తీసుకున్న నిర్ణయం ఉత్తమమైనదని నమ్ముతున్నాం. మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకొని, మా ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉంటారని కోరుకుంటున్నాం." అని జి.వి. ప్రకాష్, సైంధవి అన్నారు.
![]() |
![]() |