![]() |
![]() |
‘స్పైడర్’... ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా. మహేశ్, మురుగదాస్ కాంబినేషన్ అంటే.. ఆ మాత్రం అంచనాలు సహజం. సెప్టెంబర్ 27న సినిమా విడుదల కానుంది.
ఇదిలావుంటే.. ఈ సినిమా ఆడియో వేడుకను తెలుగు, తమిళల్లో విడివిడిగా జరపాలని తొలుత భావించారు. అయితే, దర్శక, నిర్మాతలు ఇప్పుడు నిర్ణయం మార్చేసుకున్నారు. చెన్నయ్ లో సెప్టెంబర్ 9న ఆడియో వేడుక జరుపునున్నారు. ఈ వేదికమీదే... తెలుగు, తమిళ వెర్షన్ పాటలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు ఓ తమిళ స్టార్ డైరెక్టర్, ఓ తెలుగు స్టార్ డైరెక్టర్ అతిథులుగా రానున్నట్లు తెలిసింది.
ఇక తెలుగునాట అభిమానుల కోసం సెప్టెంబర్ 17న... హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఆ వేదిక ద్వారా మీడియాతో, అభిమానులతో ముచ్చటించొచ్చు అనేది మహేష్ ప్లాన్. ఏది ఏమైనా... ‘స్పైడర్’ హడావిడి మాత్రం సెప్టెంబర్ 9 నుంచే మొదలవ్వబోతోంది. మహేశ్ అభిమానుల్లో ఇక సందడే సందడి.
![]() |
![]() |