![]() |
![]() |
మారుతి సినిమాలు మొదట్టో ఎలా ఉన్నా... ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత... అతని సినిమాలపై ఓ గౌరవం మొదలైంది ప్రేక్షకులకి. వెంకీతో చేసిన ‘బాబూ బంగారం’ పెద్దగా ఆడకపోయినా... తన మార్క్ కామెడీకి మాత్రం మంచి మార్కులే పడ్డాయ్.
త్వరలో శర్వానంద్ ని ‘మహానుభావుడు’గా చూపించబోతున్నాడు. ‘భలే భలే మగాడివోయ్’లో నానికి మతి మరుపును పెట్టి జనాన్ని కడుపుబ్బా నవ్వించిన మారుతి... ‘మహానుభావుడు’లో శర్వాకు... ‘అతి శుభ్రం’ అనే జాడ్యాన్ని తగిలించాడు. దీన్ని అడ్డం పెట్టుకొని థియేటర్లో నవ్వులు పూయించడానికి రెడీ అయ్యాడు.
ఇదిలావుంటే... ఈ సినిమా తర్వాత రెండు సినిమాలకు సైన్ చేసేశాడు మారుతి. వాటిల్లో ఒకటి నాగచైతన్యతో కాగా, రెండోది మళ్లీ శర్వానంద్ తో కావడం విశేషం. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాలు తెరకెక్కనున్నాయ్. మరి వీటిల్లో హీరో పాత్రలు ఎలా ఉంటాయో చూడాలి.
![]() |
![]() |