![]() |
![]() |

‘గుండ్రంగా ఉన్న భూమికి వాస్తులేంటి?’ అని ప్రశ్నిస్తాడు ‘కార్తికేయ’ సినిమాలో నిఖిల్. తెరపై అయితే... అలా ప్రశ్నించగలిగాడు కానీ... నిజజీవితానికి వచ్చేసరికి... నమ్మకాలకు తలవంచేశాడు. నిజానికి ఆగస్ట్ 24న నిఖిల్ ఎంగేజ్ మెంట్ జరగాల్సింది. ఆ వెంటనే అక్టోబర్ 1న... తన బంధువైన ఆంజనేయులు యాదవ్ కుమార్తె తేజస్వినిని పెళ్లాడేసి.. ఓ ఇంటివాడైపోవాల్సింది. కానీ... అలా జరగలేదు. వీరి జాతకాలు కలవకపోవడంతో పెళ్లిని కేన్సిల్ చేసేశారు. జీవితం విషయంలో రిస్క్ తీసుకోవడం ఎందుకులే అనుకున్నాడేమో పాపం. అయినా... పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయట. ఆ తర్వాతే.. అదే అమ్మయితో ఇక్కడ జరుగుతుందట. ఇది పెద్దల మాట. అంటే.. బహుశా.. నిఖిల్ కీ... తేజస్వినీకీ స్వర్గంలో పెళ్ల జరిగుండదు. అందుకే ఇక్కడ ఆగిపోయింది. మరి నిఖిల్ నిజమైన సోల్ మేట్ ఎక్కడుందో.. ఏం చేస్తుందో! రావమ్మా... మహాలక్హీ.. రావమ్మా... రావమ్మా....
![]() |
![]() |