![]() |
![]() |

బాలనటుడిగానూ, కథానాయకుడిగానూ తెలుగునాట తనదైన ముద్రవేశాడు తరుణ్. మరీముఖ్యంగా.. `నువ్వేకావాలి` (2000)తో హీరోగా డ్రీమ్ డెబ్యూ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వైనం ఇప్పటికీ టాలీవుడ్ లో ఓ సెన్సేషనే. ఆపై `ప్రియమైన నీకు`, `నువ్వు లేక నేను లేను`, `నువ్వే నువ్వే` వంటి విజయవంతమైన చిత్రాల్లో సందడి చేసిన తరుణ్.. కెరీర్ లో వేసిన కొన్ని తప్పటడుగులతో కొన్నాళ్ళ పాటు సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యాడు. మూడేళ్ళ క్రితం `ఇది నా లవ్ స్టోరీ` అంటూ పలకరించినా.. ఆశించిన ఫలితమైతే దక్కలేదు.
ఈ నేపథ్యంలో.. తాజాగా తరుణ్ సరికొత్త అవతారమెత్తాడు. అదే.. డబ్బింగ్ ఆర్టిస్ట్ అవతారం. శుక్రవారం నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతున్న మలయాళ డబ్బింగ్ చిత్రం `అనుకోని అతిథి` (ఫాహద్ ఫాజిల్, సాయిపల్లవి)లో చిత్ర కథానాయకుడు ఫాహద్ కి డబ్బింగ్ చెప్పి మెస్మరైజ్ చేశాడు తరుణ్. తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. తన తల్లి, నటి రోజా రమణి కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్రవేసిన నేపథ్యంలో.. తరుణ్ కూడా అదే బాట పడతాడేమో చూడాలి. మరీ ముఖ్యంగా.. మలయాళ చిత్రాల అనువాదాలు ఓటీటీలో వెల్లువెత్తుతున్న ఈ తరుణంలో తరుణ్ నయా అవతారం వర్కవుట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
![]() |
![]() |