![]() |
![]() |

ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'పుష్ప-2' వాయిదా పడితే.. ఆ తేదీకి రావాలని పలు సినిమాలు చూస్తున్నాయి. అయితే 'పుష్ప-2' టీం మాత్రం ఏది ఏమైనా ఆ తేదీకే వస్తామని బల్ల గుద్ది చెబుతోంది. 'పుష్ప-2' అదే డేట్ కి వస్తామని అంత బలంగా చెప్పినప్పటికీ.. నేచురల్ స్టార్ నాని మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. తన కొత్త సినిమాను ఆగస్టు 15న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు.
'అంటే సుందరానికీ' తర్వాత నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా 'సరిపోదా శనివారం'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 'దసరా', 'హాయ్ నాన్న' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత నాని నటిస్తున్న సినిమా కావడంతో 'సరిపోదా శనివారం'పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి 'పుష్ప-2' వాయిదా పడుతుందన్న ఆశో లేక పుష్ప ప్రభంజనంలోనూ తమ సినిమా సత్తా చాటుతుందన్న నమ్మకమో తెలీదు కానీ.. ఆగస్టు 15న 'సరిపోదా శనివారం' విడుదల చేయాలని నిర్ణయించారనే వార్త ఆసక్తికరంగా మారింది.
![]() |
![]() |