![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' సినిమా 2013లో సెప్టెంబర్ 27న విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే సరిగ్గా 11 ఏళ్లకు అదే తేదీకి పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమా రాబోతుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ 'ఓజీ'. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా, ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ స్టార్ రేంజ్ కి తగ్గ వసూళ్ళ సునామీ సృష్టించే సత్తా ఈ సినిమాకి ఉందని ఆయన ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆ అంచనాలను, ఫ్యాన్స్ నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని సెప్టెంబర్ 27న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే అది 'అత్తారింటికి దారేది' విడుదలైన తేదీ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి 'ఓజీ' కూడా 'అత్తారింటికి దారేది' మాదిరిగానే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.
ఇప్పటికే 'ఓజీ' చిత్రీకరణ 70 శాతానికి పైగా పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించనున్నాడు. పవన్ ఇప్పటికే దాదాపు ఆయన షూటింగ్ పార్ట్ ని పూర్తి చేశాడట. కేవలం మరో రెండు వారాల డేట్స్ కేటాయిస్తే సరిపోతుందని వినికిడి.
![]() |
![]() |