![]() |
![]() |

తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకి హీరోయిన్ గా అవకాశం రావడం చాలా అరుదుగా జరుగుతుంది.అసలు తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా రావడమే చాలా తక్కువ.అలాంటిది ఇప్పుడు ఒక అచ్చ తెలుగు అమ్మాయి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పైగా ఆ అమ్మాయి సోషల్ మీడియాలో చాలా ఫేమస్ కూడా
కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు అనే మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ద్వారా తెలుగు అమ్మాయి శివాని నాగారం హీరోయిన్ గా పరిచయం అవుతుంది. పక్కా హైదరాబాద్ కి చెందిన ఆమె అంబాజీపేట మ్యారేజి బ్యాండు షూటింగ్ కోసం ఫస్ట్ టైం 75 రోజుల పాటు అమలాపురం,అంబాజీపేట ప్రాంతంలో ఉంది. పైగా షూటింగ్ కి వెళ్లే నెల రోజుల ముందు బాగా ప్రిపేర్ అయ్యి ప్రతి డైలాగ్ ని నేర్చుకుంది. అలాగే సీన్స్ పర్పెక్ట్ గా రావాలని ఎంతో తపన పడి ప్రతి సీన్ ని ముందుగానే ప్రాక్టీస్ చేసి సినిమాలో అధ్బుతమైన పెర్ ఫార్మ్ ని ఇచ్చింది.

సినిమాలోకి రాక ముందే శివాని ఇనిస్టాగ్రమ్ లో చాలా ఫేమస్. ఫాలోవర్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అంబాజీపేట మ్యారేజి బ్యాండు తో టాలీవుడ్ లో అడుగు పెడుతుండటం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఆడిషన్ ద్వారా తనకి ఈ అవకాశం వచ్చిందని శివాని ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది.అలాగే తమ మూవీ ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుందని కూడా ఆమె చెప్పింది. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకున్న అంబాజీపేట మ్యారేజి బ్యాండు కి దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 2న అంబాజీపేట మ్యారేజి బ్యాండు థియేటర్స్ లోకి అడుగుపెడుతుంది.
![]() |
![]() |