![]() |
![]() |

సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉండే తారల్లో సమంత ఒకరు. తరచూ తనకు సంబంధించిన ఏదో ఒక ఫొటోను షేర్ చేస్తూ వస్తుంటుంది. అయితే కరోనా వ్యాప్తి భయంతో సినిమా షూటింగ్లు ఆగిపోయి, లాక్డౌన్ మొదలైన తర్వాత ఆశ్చర్యకరంగా ఆమె మౌన ముద్ర దాల్చింది. రెండు వారాలుగా సోషల్ మీడియాలో ఆమె ఎలాంటి పోస్టులూ పెట్టలేదు, ఏ ఫొటోలూ షేర్ చేయలేదు. అదివరకు తన ఫిట్నెస్కు సంబంధించిన వీడియోలు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ వచ్చిన ఆమె, ఇప్పుడు వాటినీ షేర్ చేయట్లేదు.
మరోవైపు సమంత కాంటెంపరరీ హీరోయిన్లు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం విషయంలో ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు తమ వంతు ప్రచారం చేస్తున్నారు. లాక్డౌన్కు సహకరించమని అభ్యర్థిస్తున్నారు. ఏప్రిల్ 5న 9 నిమిషాల పాటు విద్యుద్దీపాలు ఆపేసి, కొవ్వొత్తులు, లేదా ప్రమిదలు వెలిగించే పనిలో తామెలా భాగం పంచుకున్నదీ ఫొటోలు, వీడియోలతో షేర్ చేసుకున్నారు. అలాగే లాక్డౌన్ పీరియడ్లో తామేం పనులు చేస్తున్నారో చెప్తున్నారు.
కానీ సమంత నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. షూటింగ్లు లాంటివేవీ లేకపోయినా, ఇంట్లోనే ఉంటున్నా.. లాక్డౌన్ పీరియడ్లో తను ఏమేం చేస్తున్నదో ఒక్కటంటే ఒక్క విషయాన్నీ ఇంతవరకూ ఆమె షేర్ చేసుకోలేదు. ఆమెతో పోలిస్తే సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండని నాగచైతన్య సైతం అడపాదడపా ఏదో విషయం షేర్ చేసుకుంటున్నాడు. సమంత అనూహ్య మౌనానికి కారణం ఏమిటో మరి!
![]() |
![]() |