Home  »  News  »  షూటింగ్ లో హార్ట్ ఎటాక్.. డూప్ స్థానంలో సల్మాన్ ఖాన్

Updated : Aug 22, 2026

 

 

సల్మాన్ ఖాన్ కి భారతీయ సినిమా రుణపడి ఉందో, లేక భారతీయ సినిమాకి సల్మాన్ రుణపడి ఉన్నాడో తెలియదు గాని, మూడున్నర దశాబ్దాల నుంచి తనదైన ఛరిష్మాతో దూసుకుపోతున్నాడు. ఇక  సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల్లో లేదా ప్రమాదకరమైన యాక్షన్ సన్నివేశాల్లో స్టార్ హీరోలు తమ బాడీ డబుల్ లేదా డూప్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే, ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో, నేషనల్ అవార్డు గ్రహీత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ చేస్తున్నభారీ పాన్ ఇండియా చిత్రం 'మాన్‌స్టర్' (ఆ టైటిల్ ఫిక్స్ అని సమాచారం) విషయంలో ఒక ఊహించని ఘటన ఎదురైంది. 

ఈ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతున్న సమయంలో సల్మాన్ ఖాన్ బాడీ డబుల్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఈ వార్త చిత్ర బృందాన్ని తీవ్రంగా కలచివేసింది.  సాధారణంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో షూటింగ్ వాయిదా పడటం లేదా డూప్ కోలుకునే వరకు ఆగిపోవడం సహజం. కానీ,యూనిట్ కి ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తకూడదని గ్రహించిన సల్మాన్, డూప్ లేకపోయినా పర్వాలేదు, సినిమా ఆగకూడదు అనే ఏకైక లక్ష్యంతో రిస్కీ యాక్షన్ సీన్స్, హై వోల్టేజ్ ఫైట్స్ ని సల్మాన్ స్వయంగా చేస్తున్నాడు. 

Also Read: అల్లు అర్జున్ చేసిన KKAVCF ట్వీట్ కి చిరు బర్త్ డే కి ఏంటి సంబంధం!

ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా జరుపుకుంటున్న ఈ షూటింగ్‌లో కొరియన్ ప్రసిద్ధ యాక్షన్ డైరెక్టర్ సీ యంగ్ ఓ (Mr. Oh) పర్యవేక్షణలో అత్యంత భారీ స్టంట్ సీక్వెన్సులు ప్లాన్ చేశారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా సల్మాన్‌తో కలిసి 4 నుండి 5 ప్రమాదకరమైన యాక్షన్ సన్నివేశాల్లో స్వయంగా పాల్గొంటోంది. 50 ఏళ్లు పైబడిన వయసులో కూడా సల్మాన్ ఖాన్ చూపుతున్న ఈ విధమైన క్రమశిక్షణ, అంకితభావం చూసి యూనిట్ సభ్యులతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు ఆశ్చర్యపోతున్నారు.  ఈ చిత్రం 2027 ఈద్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Salman Khan, Vamsi paidipally,  DIl Raju, Tollywood

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.