![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడుగారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి మధ్య ఉన్న అనుబంధం యొక్క వయసుకి చాలా హిస్టరీ ఉంది.ఈ రోజు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చేసిన ట్వీట్ నెట్టింట స్పెషల్ కేటగిరి హోదాలో వైరల్ గా మారింది.
1978లో తెలుగు చిత్రసీమలో సాధారణ నటుడిగా అడుగుపెట్టిన చిరంజీవి, అంకితభావం కష్టపడే తత్వంతో అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తిప్రతిష్టలను సొంతం చేసుకున్నా రు. దశాబ్దాల కాలంలో వందలాది చిత్రాలలో నటించి, వెండితెరపై నటన, డాన్సులు, ఫైట్లతో సరికొత్త శకాన్ని సృష్టించడమే కాకుండా, తెలుగు సినీ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీ రారాజుగా మారిన ఆయన ప్రయాణం ఎంతోమంది యువతకి స్ఫూర్తిదాయకం. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా సామాజిక సేవా రంగంలోనూ సమాజం పట్ల తనకున్న బాధ్యతను నెరవేరుస్తూ చిరంజీవి స్థాపించిన 'చిరంజీవి బ్లడ్ బ్యాంక్' (రక్తనిధి) మరియు 'నేత్ర నిధి' ద్వారా ఎంతోమంది బాధితులకి ఉచితంగా రక్తాన్ని, అంధులకు చూపును ప్రసాదిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆపదలో ఉన్న వేలాదిమంది ప్రాణాలను కాపాడటంలో ఈ రక్త నిధి ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: కర్మ ఎవరని వదిలి పెట్టదు.. వైరల్ గా మారిన ఇష్యు
ఈ విధంగా వెండితెరపైన మాత్రమే కాక, నిజ జీవితంలోనూ ఎంతోమందికి సేవ చేస్తూ రియల్ హీరోగా నిలిచారు. కేంద్ర మాజీ మంత్రిగా, పద్మభూషణ్ గ్రహీతగా ఆయన పొందిన గౌరవాలు తెలుగువారికి గర్వకారణం. చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ఆనందోత్సాహాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్వీట్ చేసారు.
Chiranjeevi, chandrababu Naidu, Tollywood
![]() |
![]() |