Home  »  News  »  అల్లు అర్జున్ చేసిన KKAVCF ట్వీట్ కి చిరు బర్త్ డే కి ఏంటి సంబంధం!

Updated : Aug 22, 2026

 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..పుష్ప సిరీస్ తో  పాన్ ఇండియాని షేక్ చేసి అదే ఆనవాయితీని కంటిన్యూ చేయడానికి 'రాకా' ని ముస్తాబు చేస్తున్న విషయం తెలిసిందే. అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను 'రాకా' పై భారీ అంచనాలు ఉన్నాయి. 


ఈ రోజు తన మావయ్య మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా 'మన ఏకైక మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మా అందరికీ ఎంతో అండగా నిలిచారు. మాలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తూ, మమ్మల్ని ముందుకు నడిపించారు” అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.అయితే ఈ ట్వీట్ చివరలో చేసిన  #KKAVCF (IYKYK) అనే పదాలే ఇప్పుడు నెటిజన్లలో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. అల్లు అర్జున్ ఈ హ్యాష్‌ట్యాగ్‌కు నేరుగా అర్థం చెప్పకుండా IYKYK అని పేర్కొన్నారు. దీని అర్థం “If You Know, You Know”. అంటే.. విషయం తెలిసిన వారికి దాని వెనుక ఉన్న అసలు అర్థం అర్థమవుతుందన్నట్లుగా  ట్వీట్ లో పేర్కొన్నాడు. 

Also Read: చిరంజీవిపై సీఎం చంద్రబాబు ట్వీట్ వైరల్..రక్తనిధి, నేత్రనిధితో మానవత్వాన్ని చాటుకున్నారు

అయితే అల్లు అర్జున్ గతంలో ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యను గుర్తు చేసుకుంటే ఈ హ్యాష్‌ట్యాగ్ వెనుక మ్యాటర్  అర్థమవుతోంది. “కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్” అంటూ  గతంలో చెప్పిన మాట అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది. అప్పట్లో ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు అదే మాటను షార్ట్ ఫార్మ్‌లో #KKAVCFగా ఉపయోగిస్తూ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారని అభిమానులు భావిస్తున్నారు.

  Chiranjeevi, Allu Arjun, Tollywood


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.