![]() |
![]() |
.webp)
`స్టార్ మా`లో ప్రసారం అవుతున్న ధారావాహిక `గుప్పెడంత మనసు`. ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ వసుధార , రిషీ జంట ప్రధానంగా సాగుతోంది. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ ఈ సోమవారం 298వ ఎపిసోడ్‌లోకి ఎంటరవుతోంది. ఈ సోమవారం ఏం జరగబోతోంది? .. వసుధారపై జగతి ఎందుకు సీరియస్ అయింది? అన్నది ఒకసారి చూద్దాం.
జగతి ఇంట్లో వసుధార బాధతో ఉంటే రిషి రావడం..తెలిసిందే. ఆ తరువాత రిషిని హగ్ చేసుకుని వసు ఏడ్వడం.. రిషి కూడా వసుధారని దగ్గరకు తీసుకోవడం `మీరు నన్ను దూరంపెడితే తట్టుకోలేను` అని వసు అనడం చూశాం. కానీ అది వసు ఊహ అని తెలియడంతో అంతా షాక్ అవుతారు. ఆ వెంటనే తేరుకున్న వసుధార కిచెన్‌లోకి వెళ్లడం.. రిషి ఎక్కడున్నాడా అని ఆరాతీయడానికి దేవయాని ఫోన్ చేయడం.. అది గమనించని వసుధార `సార్ కాఫీ కావాలా` అని అనడం.. ఆ మాటలు విన్న దేవయానికి అనుమానం వస్తుంది.
ఇది గమనించిన రిషి వెంటనే దేవయాని ఫోన్ కట్ చేసి నేను నిన్ను కాఫీ కావాలని అడిగానా? అని వసుని మందలిస్తాడు. కట్ చేస్తే .. ఇంటికి వచ్చిన జగతికి రిషి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాడని వసుధార ఆనందంగా చెబుతుంది. ఆ మాటలు అంటుండగానే జగతి ... వసుధారపై సీరియస్ అవుతుంది. నువ్వే ఈ ఇంట్లో గెస్ట్‌వి.. అలాంటిది నువ్వో గెస్ట్ ని పిలిచి ట్రీట్ ఇస్తావా? అని ఫైరవుతుంది. జగతి నుంచి ఇలాంటి ప్రశ్నలు తలెత్తడంతో వసుధార షాక్‌కు గురవుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? .. జగతి ఎందుకు ఫైర్ అయ్యింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
![]() |
![]() |