![]() |
![]() |

సుప్రీం హీరో 'సాయిదుర్గాతేజ్'(saidhurgatej)ప్రస్తుతం తన కొత్త చిత్రం 'సంబరాల యేటిగట్టు' తో బిజీగా ఉన్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, 'సాయిదుర్గాతేజ్' తో ఐశ్వర్య లక్ష్మి జతకడుతుంది. రోహిత్ కె పి దర్సకత్వంలో 'హనుమాన్' మూవీ మేకర్ 'నిరంజన్ రెడ్డి' అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ తాజాగా ప్రారంభమైంది.
సాయిదుర్గాతేజ్ సామాజిక సేవాపరంగా జరిగే కార్యక్రమాలకి కూడా హాజరవుతాడనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రీసెంట్ గా 'అభయం మాసూమ్ సమ్మిట్' కి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి తేజ్ తో మాట్లాడుతు 'మీ పెళ్లి ఎప్పుడు అని అడిగాడు. అందుకు తేజ్ మాట్లాడుతు కొన్ని మీడియా సంస్థలు చేసిన పనికి నా కాలేజీ టైం నుంచి ఉన్న లవర్ నన్ను విడిచి పెట్టి వెళ్లిపోయింది. నా సినిమా హిట్ అయిన ప్రతి సారి మీడియాలో రకరకాల అమ్మాయిలతో పెళ్లి అని వార్తలు రావడమే అందుకు కారణం.
మీడియా సైలెంట్ గా ఉంటే నా పెళ్లి నేను అనౌన్స్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. 'అభయం మాసూమ్ సమ్మిట్' అనేది పిల్లల భద్రత మరియు సాధికారత కోసం వ్యవస్థలను నిర్మించడానికి , వైద్యంని ప్రోత్సహించడానికి ఏర్పడిన సంస్థ. ఇందుకు కావాల్సిన అన్ని విషయాలని సదరు సంస్థ చూసుకుంటుంది.
![]() |
![]() |