![]() |
![]() |

'మంచు లక్ష్మి'(Manchu lakshmi)ప్రస్తుతం తన సోదరుడు 'మనోజ్'(Manchu Manoj)నెగిటివ్ రోల్ లో చేసిన 'మిరాయ్'(Mirai)సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. దైవ శక్తిని పొందాలని చూసే 'మహావీర్' గా మనోజ్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడని, దీంతో పాన్ ఇండియా మేకర్స్ కి సరికొత్త విలన్ దొరికాడనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక 'మంచు లక్ష్మి' గత నెలలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ని సంబంధించిన కేసులో 'ఈడి'(ED)విచారణకి హాజరైన విషయం తెలిసిందే. ఈ సమయంలో అధికారులు పలు సమాధానాలు రాబట్టారు. ఇందుకు సంబందించిన వార్తలు కూడా సోషల్ మీడియాతో పాటు ఇతర మీడియా సంస్థల్లో ప్రసారమయ్యాయి.
రీసెంట్ గా ఈ విషయంపై మంచు లక్షి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఈడి విచారణ తర్వాత మీడియాలో నా పై వచ్చిన వార్తలు చూసి బాధపడ్డాను. దర్యాప్తులో నేను ఎదుర్కున్న వాటి గురించి చెప్పకుండా, మీడియా మరో విషయాన్నీ హైలెట్ చేసింది. ఈ కేసులో చిట్టచివరి వ్యక్తిని కూడా విచారించాలని కూడా వారు చెప్పడం హాస్యాస్పదం. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి డబ్బు ఎలా సమకూరుతుంది, ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదులకి నిధులు వెళ్తున్నాయా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. వంద మంది బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేసారని, అందులో నేను కూడా ఉన్నానని చెప్పడంతో విచారణకి వెళ్ళాను. అసలు ఈ యాప్ లు ఎక్కడ నుంచి ప్రారంభమవుతున్నాయి. వీటి ఉనికి ఏంటనే పెద్ద సమస్యని అధికారులు ఎందుకు పరిష్కరించడం లేదని మంచు లక్షి తెలిపారు. ప్రస్తుతం ఆమె మాటలు వైరల్ గా నిలిచాయి.
సినిమా పరంగా చూసుకుంటే మంచు లక్ష్మి గత ఏడాది నవంబర్ లో యాక్షన్, ఫాంటసీ,థ్రిల్లర్ గా తెరకెక్కిన 'ఆదిపర్వం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.
![]() |
![]() |