![]() |
![]() |

భైరవం తర్వాత 'బెల్లంకొండ సాయిశ్రీనివాస్'(Bellamkonda Sai srinivas)నిన్నవరల్డ్ వైడ్ గా 'అనుపమ పరమేశ్వరన్'(Anupama Parameswaran)తో కలిసి 'కిష్కింధపురి'(Kishkindhapuri)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హర్రర్, మిస్టరీ, థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana shankara Varaprasad garu)ని నిర్మిస్తున్న 'సాహు గారపాటి' నిర్మించాడు. 'చావు కబురు చల్లగా' ఫేమ్ 'కౌశిక్ పెగుళ్ళపాటి'(Koushik pegallapati)దర్శకుడు. ప్రచార చిత్రాల్లో సాయిశ్రీనివాస్ మాట్లాడుతు 'కిష్కిందపురి'థియేటర్లలోకి వెళ్లిన పది నిమిషాల తర్వాత ప్రేక్షకులు ఫోన్ పట్టుకుంటే తాను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని చెప్పడంతో రిలీజ్ కి ముందే 'సాయిశ్రీనివాస్' అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకుంది.
తొలి రోజు ఎవరు ఊహించని విధంగా 'కిష్కింధపురి' నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. మూవీకి సంబంధించి ఎక్కువ శాతం రివ్యూస్ నెగిటివ్ గా వస్తున్నాయి. చిత్ర యూనిట్ మాత్రం తమ చిత్రం విజయంతమైందని సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కలెక్షన్స్ ఎలా వసూలు చేస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ చిత్రంతో పాటు రిలీజైన 'మిరాయ్'(Mirai)కి పాజిటివ్ టాక్ రావడం కిష్కింధపురికి మైనస్ గా పరిగణించే అవకాశం ఉందనే మాటలు సినీ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. ఇక మిరాయ్ తొలి తోజు వరల్డ్ వైడ్ గా 27 . 20 కోట్లు వసూలు చేసినట్టుగా చిత్ర బృందం అధికారంగా ప్రకటించింది.
సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ లు ఘోస్ట్ గైడ్స్ గా చెయ్యగా, శాండీ మాస్టర్ నెగిటివ్ రోల్ లో ప్రేతాత్మగా కనపడ్డాడు. తనికెళ్ళ భరణి, హైపర్ ఆది, మకరంద్ దేశ్ పాండే, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం ఇతర పాత్రల్లో కనిపించారు. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్. 12 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కినట్టుగా తెలుస్తోంది
![]() |
![]() |