![]() |
![]() |

"శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా... ఆ మహాశిఖరం తలతిప్పి చూడదు. మీకు అర్థమైందిగా. #పవర్‌స్టార్ #పవన్‌కల్యాణ్" - ఇదీ యంగ్ హీరో నిఖిల్ ఈ రోజు చేసిన ట్వీట్. దానికి పవన్ కళ్యాణ్ థంబ్స్ అప్ సింబల్ చూపిస్తున్న జిఫ్ కూడా జోడించారు.
రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' ట్రైలర్ విడుదలైన కొన్ని నిమిషాల తరవాత నిఖిల్ ట్వీట్ చేశారు. అతడు పవన్ కళ్యాణ్ అభిమాని. వర్మను ఉద్దేశించి, అతడి పేరు ప్రస్తావించకుండా ఆ ట్వీట్ చేశారని అందరికీ అర్థమవుతోంది. అందులో వర్మను కుక్కతో, పవన్ కళ్యాణ్ ని మహాశిఖరంతో నిఖిల్ పోల్చారని అభిమానులు అంటున్నారు.
నిఖిల్ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. అతడు హీరో కాబట్టి వైరల్ అయ్యింది. పవన్ అభిమానులలో చాలామంది నిఖిల్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. మెగాభిమానులు అందరూ వర్మ మీద విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో అతడిని చీల్చి చెండాడుతున్నారు. ఒక రేంజ్ లో తిడుతున్నారు. వర్మకు కావాల్సిందీ, వర్మ కోరుకున్నదీ ఇదే. మంచో, చెడో... ఏదో ఒకటి, నలుగురి నోళ్ళలో నానాలనీ, ఈ రోజు ట్రైలర్ చూసినోళ్లు రేపు సినిమా సినిమా చూస్తారని చెప్తున్నారట.
![]() |
![]() |