![]() |
![]() |

దుర్మార్గం జయించదనే ఇతివృత్తంతో తెరకెక్కిన కౌబాయ్ మూవీ `దెబ్బకు ఠా దొంగల ముఠా`. ``నటభూషణ`` శోభన్ బాబు, ``కళాభినేత్రి`` వాణిశ్రీ, ``నట సార్వభౌమ`` ఎస్వీ రంగారావు వంటి మేటినటుల కలయికలో రూపొందిన ఈ చిత్రంలో రాజబాబు, రాజనాల, అల్లు రామలింగయ్య, త్యాగరాజు, ముక్కామల, సంధ్యారాణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. మిక్కిలినేని, నిర్మల అతిథి పాత్రల్లో సందడి చేయగా.. జ్యోతిలక్ష్మీ ఓ ప్రత్యేక గీతంలో మెరిశారు. ఈ చిత్రానికి సముద్రాల రామానుజాచార్య అందించిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
బి. శంకర్ సంగీతసారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని గీతాలకు.. సి.నారాయణ రెడ్డి, కొసరాజు సాహిత్యమందించారు. పాటల్లో ``అబ్బో ఏం గురి ఓరబ్బో గడసరి``, ``అందాల బొమ్మను``, ``ఎవురివి బావ``, ``నా కంటికానినోడు``, ``అప్పనకొండ``.. అప్పటి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. పురాణం సుబ్రమణ్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డీఎల్ పిక్చర్స్ పతాకంపై డీఎల్ నారాయణ నిర్మించారు. 1971 మే 20న విడుదలైన `దెబ్బకు ఠా దొంగల ముఠా`.. నేటితో 50 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |