![]() |
![]() |

ఆరేళ్ళ కెరీర్ లో తొమ్మిది చిత్రాలతో సందడి చేసింది కన్నడ కోమలి నభా నటేశ్. కన్నడంలో మూడు సినిమాలు (వజ్రకాయ, లీ, సాహెబా).. తెలుగులో ఆరు చిత్రాలు (నన్ను దోచుకుందువటే, అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్) చేసిన నభ.. ప్రస్తుతం తన కెరీర్ లో పదో చిత్రంగా `మేస్ట్రో` చేస్తోంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అంధాధున్`కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తుండగా.. ఇందులో యూత్ స్టార్ నితిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో కలిసి నటిస్తోంది నభా నటేశ్.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇప్పటివరకు నభ నటించిన సినిమాలన్నీ స్ట్రయిట్ సబ్జెక్ట్స్ తో తెరకెక్కిన చిత్రాలే కాగా.. `మేస్ట్రో` మాత్రం తన కెరీర్ లోనే ఫస్ట్ రీమేక్ మూవీ. ఒరిజినల్ లో రాధికా ఆప్టే చేసిన క్యారెక్టర్ లో ఇక్కడ నభ కనిపించనుంది. మరి.. కెరీర్ లో మొదటిసారిగా చేస్తున్న ఈ రీమేక్ నభకి ఏ మేరకు ప్లస్సవుతుందో చూడాలి. కాగా, జూన్ 11న విడుదల కావాల్సిన `మేస్ట్రో`.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడనుంది.
ఇదిలా ఉంటే.. `మేస్ట్రో`కి మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నాడు.
![]() |
![]() |