![]() |
![]() |

అషురెడ్డి.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల హీరో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ని కలిసిన అషురెడ్డి తనకు ఆయన ఓ లెటర్ రాశారని, మురిసిపోయింది. మళ్లీ తన దేవుడిని చూశానంటూ సంబరపడింది. అంతే కాకుండా ఆయన ఊ అంటే నాలుగవ భార్యగా వుండేందుకు మీరు సిద్ధమేనా?.. అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సిద్ధమే అంటూ సమాధానం చెప్పి అడ్డంగా దొరికి పోయింది.
క్రిష్‌తో చేస్తున్న పిరియాడిక్ ఫిల్మ్ షూటింగ్ లొకేన్లో పవన్ వున్నారని తెలుసుకున్న అషురెడ్డి ఆయనని కలడానికి అక్కడికి వెళ్లింది. ఆయనతో కొంత సమయం గడిపి ఫొటోలకు పోజులిచ్చింది. తను కోరుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటూ అషుకు పవన్ ఓ లెటర్ని కూడా అందించారు. ఈ రెండింటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అషురెడ్డి మురిసిపోయింది. అయితే తను చెప్పిన మాటలు మీడియాలో ప్రసారం కావడంతో ఖంగుతిన్న అషురెడ్డి సదరు వార్తల్ని ప్రసారం చేసిన వారిపై తాజాగా మండిపడింది.
నా మాటల్ని వక్రీకరించారని, మళ్లీ ఇలాంటి పని చేస్తే నాలాంటి లేడీ ఫ్యాన్స్‌ని ఆయన కలవడానికి ఇష్టపడరని ఆవేదన వ్యక్తం చేసింది. "పవన్ నాకు దేవుడు, నేను ఆయన భక్తురాలిని.. ఒక అభిమాని, దేవుడి రిలేషన్ అంత వరకే వుంటుంది, అంతకు మించి వుండదు. ఇకపై నాపై తప్పుడు రాతలు రాస్తే ఊరుకోను." అంటూ వార్నింగ్ ఇచ్చినంత పని చేసింది.

![]() |
![]() |