![]() |
![]() |

నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవినవుతా అంటూ ఆ మధ్య రిలీజ్ అయిన వార్తలేరు వీరయ్య పాటకు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఆ పాటను ఎంత చలిలో తెరకెక్కించారనే విషయాలను కూడా ఆ మధ్య లీక్ చేశారు మెగాస్టార్. లేటెస్ట్ గా వాల్తేరు వీరయ్యలో శ్రీదేవి పాట గురించి స్పందించారు చిత్ర కథానాయిక శ్రుతిహాసన్. మూడు నిమిషాల పాటు సాగే పాట ఇది. శ్రుతిహాసన్, చిరంజీవి బెస్ట్ స్టెప్పులు వేశారని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ సందర్భంలో శ్రుతి చెప్పిన మాటలు అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి.
``మంచు గడ్డ కట్టే చలిలో మేం ఈ పాటను చిత్రీకరించాం. ఈ పాటలో నటించిన తర్వాత ఇలాంటి లొకేషన్లలో నాకు ఇంకో పాట లేకుంటే బావుండనిపించింది. అలాంటి చలిలో అమ్మాయి చీర కట్టుకుని స్టెప్పులేయడం ఫిజికల్‌గా చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇంత ఓపెన్‌గా ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పినా సరే, జనాలు ఇంకా ఇలాంటి పాటలు చూడాలనుకుంటే, అందులోనూ గడ్డకట్టే చలిలో అమ్మాయిల్ని చీరల్లో చూడాలనుకుంటే మేం కూడా చేసేదేమీ లేదు.
అలాంటి పాటల్లో నటిస్తాం. కానీ నిజంగా చెబుతున్నా, ఏ మహిళకైనా అలాంటి వాతావరణంలో చీరకట్టుకుని స్టెప్పులేయడం సౌకర్యవంతంగా మాత్రం అనిపించదు`` అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ్ రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూసి మెగా మాస్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేశాయి. కేథరిన్ ఈ సినిమాలో మరో నాయికగా నటిస్తున్నారు.
![]() |
![]() |