![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం 'ధమాకా' వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పదో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.4.20 కోట్ల షేర్ వసూలు చేసి.. పదో రోజు కలెక్షన్ల పరంగా తెలుగులో నాన్-రాజమౌళి రికార్డు సృష్టించిన ఈ చిత్రం తాజాగా మరో ఘనత సాధించింది. తెలుగునాట వరుసగా 12 రోజుల పాటు కోటికి పైగా రాబట్టి.. 'కేజీఎఫ్-2' రికార్డుని సమం చేసింది.
2022 లో విడుదలైన చిత్రాలలో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 17 రోజుల పాటు కోటికి పైగా షేర్ రాబట్టి 'ఆర్ఆర్ఆర్' టాప్ పొజిషన్ లో ఉండగా.. కన్నడ చిత్రం 'కేజీఎఫ్-2' తెలుగునాట వరుసగా 12 రోజులు కోటికి పైగా రాబట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక డిసెంబర్ 23న విడుదలైన 'ధమాకా' భారీ కలెక్షన్లతో దూసుకుపోతూ 'కేజీఎఫ్-2' రికార్డుని సమం చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో సర్కారు వారి పాట(11 రోజులు), కార్తికేయ-2(11 రోజులు) ఉన్నాయి.
12 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.31.92 కోట్ల షేర్ రాబట్టిన ధమాకా.. వరల్డ్ వైడ్ గా రూ.37.33 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఈ వీకెండ్ లోనూ ధమాకా కలెక్షన్ల జోరు చూపే అవకాశముంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో.. తేలికగా మరో ఐదారు కోట్ల షేర్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
![]() |
![]() |