![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'ఓజి'(og).ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్, టీజర్ తో అభిమానులతో పాటుప్రేక్షకుల్లోను 'ఓజి' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ క్రేజ్ ని రెట్టింపు చేసేలా కొద్దీ సేపటి క్రితం 'ఓజి' నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
'ఓజి ఫైర్ స్టోర్మ్' లిరిక్ అంటు రిలీజైన వీడియో సాంగ్ లో 'ఓజాస్ లీడర్ వచ్చాడు. 'ఓజాస్ గంభీర',హోల్డ్ యువర్ బ్రీత్ అండ్ ఫియర్, డ్రాగన్ కమింగ్ నియర్, అంటు సాంగ్ ప్రారంభమయ్యి మూవీపై అంచనాల్ని రెట్టింపు చేసింది. సుమారు మూడు నిమిషాల యాభై సెకన్ల నిడివి ఉన్న టోటల్ సాంగ్ ని చూస్తుంటే 'ఓజి' లో పవన్ క్యారక్టరయిజేషన్ మొత్తాన్ని చెప్పినట్టయ్యింది. సాంగ్ తో పాటు రిలీజ్ చేసిన వీడియో కూడా ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది. సదరు వీడియోలో మ్యూజిక్ అని అందించిన తమన్(Taman)కనపడి, కొత్త జోష్ ని తీసుకొచ్చాడు. సాంగ్ కంపోజింగ్ ఫస్ట్ నుంచి చివరి దాకా స్పీడ్ గా ఉండటంతో, సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.
విశ్వ, శ్రీనివాస్ మౌళి సాహిత్యాన్ని అందించగా రాజకుమారి,నజీరుద్దీన్, థమన్, దీపక్ బ్లూ పాడటం జరిగింది. సెప్టెంబర్ 25 న విడుదల కానున్న 'ఓజి' లో పవన్ సరసన ప్రియాంక మోహన్ జోడి కట్టగా, శ్రీయరెడ్డి, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్,అర్జున్ దాస్. శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆర్ఆర్ ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య, ఆయన కుమారుడు కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సాహూ ఫేమ్ సుజిత్ దర్శకుడు.

![]() |
![]() |