![]() |
![]() |

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా సినిమా 'రెడ్'. కథానాయకుడిగా అతను ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. ఇంతకుముందు 'ఎందుకంటే ప్రేమంట' సినిమాలో రెండు గెటప్పుల్లో కనిపించాడు. పునర్జన్మల నేపథ్యంలో ఆ చిత్ర కథ ఉంటుంది. 'రెడ్'లో తెరపై ఒకేసారి ఇద్దరు రామ్ లను చూడొచ్చు. దేశంలో కరోనా విజృంభణకు ముందే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇటలీలోని కరోనా విలయ తాండవం చేయడానికి ముందు అక్కడికి వెళ్లి పాటలను చిత్రీకరించుకుని వచ్చారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను రామ్ పూర్తి చేశారు.
లాక్ డౌన్ సమయంలో 'రెడ్'కి ఓటీటీ వేదికల నుండి మంచి ఆఫర్లు వచ్చాయి. అయితే థియేటర్లలోనే చిత్రాన్ని విడుదల చేయాలని అమ్మలేదు. ఈ నెల 15 నుండి థియేటర్లు తెచ్చుకున్న నేపథ్యంలో త్వరలో విడుదలకు సన్నాహాలు ఏమైనా చేస్తారేమో చూడాలి.
'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాల తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటించిన చిత్రమిది. ఇందులో మాళవిక శర్మ హీరోయిన్. నివేదా పేతురాజ్ మరో హీరోయిన్.
![]() |
![]() |