![]() |
![]() |

నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ మరో నిర్మాత, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ చంటి అడ్డాలపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చంటి అడ్డాల నుంచి తాను 'ఐనా ఇష్టం నువ్వే' సినిమా హక్కులు కొనుగోలు చేశాననీ, అందులో భాగంగా ఆయనకు రూ.9 లక్షల చెక్ ఇచ్చానని వెల్లడించారు. "బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ ఉంది. కానీ చంటి అడ్డాల బ్యాంకులో చెక్ వేయకుండా... నా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు." అని చెప్పారు.
దీనికి ప్రతిగా గురువారం ఆయన చంటి అడ్డాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. "నేను కూడా ఈ రోజు తగిన ఆధారాలు పోలీసులకు ఇచ్చి... చంటి అడ్డాల చేస్తున్న వైట్ కాలర్ మోసాలపై ఫిర్యాదు చేసాను. సినిమాను మొదట నాకు అమ్మి.. ఆ తరువాత టైటిల్ మార్చి వేరేవాళ్లకు అమ్మి నన్ను మోసం చేశాడు". అని నట్టి కుమార్ ఆరోపించారు.
ఈ విషయాన్ని ఫిలిం చాంబర్ దృష్టికి తీసుకెళ్లి లీగల్ గా ఫైట్ చేద్దాం అనుకున్నాననీ, కానీ చంటి అడ్డాల మాత్రం హై లెవల్‌లో ఇన్ ఫ్లూయెన్స్ చేసి తనమీద కంప్లైంట్ ఇచ్చారనీ ఆయన చెప్పారు. "నేను కూడా అతనిపై ఫిర్యాదు చేశా. పోలీసులపైనా, న్యాయస్థానాలపైనా నాకు నమ్మకం ఉంది. నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా" అన్నారు నట్టి.
ఆర్ట్ డైరెక్టర్‌గా పాపులర్ అయిన చంటి అడ్డాల నిర్మాతగా మారి జూనియర్ ఎన్టీఆర్‌తో 'అల్లరి రాముడు', ప్రభాస్‌తో 'అడవి రాముడు', అల్లరి నరేశ్‌తో 'యముడికి మొగుడు' తదితర చిత్రాలు నిర్మించారు. రమేశ్‌వర్మను 'ఒక ఊరిలో' చిత్రంతో డైరెక్టర్‌ని చేసింది ఆయనే.
![]() |
![]() |