![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి గురువారం నాడు తనకు పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామగారు అల్లు రామలింగయ్యను గుర్తు చేసుకున్నారు. మామ గారి జయంతి సందర్భంగా పెళ్లినాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో కల్మషం లేని చిరంజీవి నవ్వు, నిండు నూరేళ్ళు భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్న అల్లు రామలింగయ్యను చూస్తే మహా ముద్దు వస్తున్నదని అభిమానులు, ప్రేక్షకులు అంటున్నారు.
"శ్రీ అల్లు రామలింగయ్య గారి 99 వ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటున్నా. మావయ్యగానే కాకుండా నటుడిగా, వైద్యుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, గురువుగా, ఆధ్యాత్మిక వేత్తగా, మంచి మనిషిగా ఆయనలోని బహుముఖ ప్రజ్ఞాశాలిని ఎప్పుడూ ఆరాధిస్తా. అల్లుగారు... మీరు ఎప్పుడూ మా ఆలోచనల్లో ఉంటారు" అని చిరంజీవి అన్నారు. వచ్చే ఏడాది అల్లు రామలింగయ్య శతజయంతిని సెలబ్రేట్ చేస్తామని పేర్కొన్నారు.

![]() |
![]() |