![]() |
![]() |

`భీమిలి కబడ్డీ జట్టు`(2010)లో కబడ్డీ ఆటగాడిగా.. `జెర్సీ`(2019)లో మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ గా అలరించారు నేచురల్ స్టార్ నాని. కట్ చేస్తే.. త్వరలో ఈ యంగ్ హీరో మరో స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నారట. ఈ సారి ఫుట్ బాల్ ప్లేయర్ గా నేచురల్ స్టార్ కనిపించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి దర్శకుడు, ఇతర వివరాలు వెల్లడి కానున్నాయని సమాచారం. కాగా, `భీమిలి కబడ్డీ జట్టు`, `జెర్సీ` చిత్రాలు నానికి నటుడిగా మంచి పేరు తీసుకువచ్చినప్పటికీ.. కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించలేదు. మరి.. ఫుట్ బాల్ నేపథ్యంలో సాగే చిత్రంతోనైనా ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన `టక్ జగదీష్` విడుదలకు సిద్ధమవగా.. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తున్న పిరియడ్ డ్రామా `శ్యామ్ సింగ రాయ్` చిత్రీకరణ దశలో ఉంది. అలాగే.. వివేక్ ఆత్రేయ రూపొందించనున్న `అంటే.. సుందరానికీ!` త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూడు సినిమాలు కూడా ఆయా దర్శకులకు మూడో చిత్రాలు కావడం విశేషం.
![]() |
![]() |