![]() |
![]() |

సమంత టైటిల్ రోల్ చేస్తున్న సినిమా 'శాకుంతలం'. ఓ విధంగా సమంత నటిస్తున్న మొట్టమొదటి కాస్ట్యూమ్ డ్రామా ఇదేనని చెప్పవచ్చు. గురువారంతో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు అందరికీ హగ్గులు ఇచ్చి మరీ సమంత వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసిన సమంత ఎమోషనల్‌గా కొన్ని మాటలు రాసుకొచ్చారు.
"శాకుంతలం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. జీవితాంతం ఈ సినిమా గుర్తుంటుంది, నాతో ఉంటుంది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు జానపద కథలు కథలు నమ్మేదాన్ని. ఇప్పటికీ పెద్దగా ఏం మారలేదు. నమ్ముతున్నాను. గుణశేఖర్ గారు నా ఫెయిరీ గాడ్‌ఫాదర్. నా కలను నిజం చేశారు. ఆయన 'శాకుంతలం' కథ చెప్పినప్పుడే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయా. అది ఏ ఇతర ప్రపంచంలా లేదు. కానీ, నెర్వస్ ఫీలయ్యా. భయపడ్డాను.. అంత అందమైన ప్రపంచాన్ని వెండితెరపై క్రియేట్ చేయగలమా? అని. కానీ, ఈ రోజు చెబుతున్నా.. గుణశేఖర్ గారు అద్భుతంగా క్రియేట్ చేశారు. నీతా లుల్లా మనసుపెట్టి దుస్తులు డిజైన్ చేశారు" అని సమంత రాశారు.

యూనిట్ లో కీలక సభ్యులకు పేరు పేరునా థాంక్స్ చెపారు. దుష్యంతునిగా నటించిన మలయాళం నటుడు దేవ్ మోహన్‌ను ప్రిన్స్ చార్మింగ్ అంటూ ప్రశంసించారు. ఇవాళ ఈ ప్రపంచంలో తానొక స్పెషల్ గర్ల్ కింద ఫీలవుతున్నానని సమంత చెప్పుకొచ్చారు. ఆమె ఇంతలా ఎమోషనల్ అవడం చూస్తుంటే.. 'శాకుంతలం' సినిమాను ఆమె ఎంతగా ప్రేమించారో, శకుంతల పాత్రను ఎంతగా సొంతం చేసుకున్నారో అర్థమవుతోంది.
మార్చిలో 'శాకుంతలం' షూటింగ్‌ను ప్రారంభించారు గుణశేఖర్. కొవిడ్ టైమ్స్‌లో ఒక పౌరాణిక చిత్రాన్ని ఇంత త్వరగా పూర్తి చేయడం విశేషమే.
![]() |
![]() |