![]() |
![]() |

సమంత నటించిన తమిళ్ మూవీ 'కాతువాకుల రెండు కాదల్' నుంచి తాజాగా ఆమె లుక్ విడుదలైంది. విజయ్ సేతుపతి, నయనతారతో కలసి సమంత నటించిన ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సమంత పాత్ర పేరుని, ఆమె లుక్ ని తాజాగా మేకర్స్ రివీల్ చేశారు.
'కాతువాకుల రెండు కాదల్' సినిమాలో 'ఖతీజా'గా సమంత కనిపించనుంది. పోస్టర్ లో సమంత చాలా గ్లామర్ గా ఉంది. పబ్ లో కూర్చొని చిటికెన వేలి గోరు కొరుకుతూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్న సమంత లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ నుంచి విజయ్ సేతుపతి లుక్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో విజయ్.. 'రాంబో'గా కనిపించనున్నాడు. 'రాంబో'గా విజయ్ లుక్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే మేకర్స్ నయనతార లుక్ ని కూడా విడుదల చేయనున్నారు.

ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను 7 స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ లో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
![]() |
![]() |