Home  »  News  »  ప్రీతీ ముకుందన్ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు.. ఆ అపర మేధావికి మునిమనవరాలు!

Updated : Jul 18, 2026

 

-బ్లాస్ట్ జోన్ తో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సొంతం 
-ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలియడంతో అందరు షాక్ 
-ఎంతైనా ప్రీతీ గ్రేట్ అంటున్న ఫ్యాన్స్, నెటిజన్స్ 


ప్రీతీ ముకుందన్(Preity Mukhundhan)ఏ ముహూర్తాన బ్లాస్ట్ జోన్ మూవీ చేసిందో గాని ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ పొందింది. ఈ చిత్రంలో గ్లామర్ కే సరికొత్త అర్ధం చెప్పేలా ప్రీతీ ప్రదర్శించిన పెర్ఫార్మ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. బ్లాస్ట్ జోన్ కంటే ముందే చేసిన కన్నప్ప లో కూడా అదే స్థాయి పెర్ఫార్మ్ చేసి మెప్పించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రీతి ముకుందన్ నేపథ్యం గురించిన ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది.


శ్రీనివాస రామానుజన్(Srinivasa ramunajan).. భారతదేశం గర్వించదగ్గ ప్రపంచ ప్రసిద్ధ గణిత మేధావి. ఆయన కుటుంబానికి ప్రీతీ వారసురాలని తెలుస్తోంది. అమ్మ తరపు బంధుత్వం ప్రకారం రామానుజన్ ప్రీతీకి ముత్తాత అవుతారట. 1887లో జన్మించి కేవలం 32 ఏళ్ల వయసులోనే 1920 ఏప్రిల్ 26న కన్నుమూసిన ఆ లెక్కల మాంత్రికుడి జీన్స్ ఈమెలో కూడా ఉన్నాయని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  కేవలం అందంతోనే కాకుండా చదువులోనూ ప్రీతి ముకుందన్ తన జీనియస్ మైండ్‌ను నిరూపించుకుంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ ఎన్ఐటి ట్రిచీ నుండి బీటెక్  డిగ్రీని పూర్తి చేసింది. కేవలం చదువే కాదు, సాంప్రదాయ నృత్యమైన భరతనాట్యంలో కూడా అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. 


Also read: విజయ్ పై వరలక్ష్మి శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు.. 2018 లోనే ఆ విషయం తెలుసు

కళలు, మేధస్సు పుట్టుకతోనే అబ్బాయనడానికి మరో ఉదాహరణ కూడా ఉంది. అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందిన ప్రముఖ గిటార్ విద్వాంసుడు 'గిటార్ ప్రసన్న' కూడా ప్రీతి ముకుందన్‌కు స్వయానా మేనమామ అవుతారు. ఇలాంటి ఒక గొప్ప శాస్త్రవేత్తల, కళాకారుల విలక్షణమైన నేపథ్యం నుండి గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.ప్రీతీ ప్రస్తుత సినీ కెరీర్ విషయానికి వస్తే అల్లు అర్జున్ నుంచి రాబోయే ఒక ప్రతిష్టాత్మక చిత్రంలోనూ, ధనుష్ 56వ సినిమాలోని ప్రీతీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.  

preity mukhundhan, srinivasa ramanujan

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.